ఛాన్స్ దొరికితే చాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చైనా భావిస్తూ ఉంది. కొద్ది నెలలుగా చైనా పన్నాగం బయటకు వస్తూనే ఉంది. బయటకు శాంతి అంటూ చెబుతున్న చైనా.. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడానికి సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే భారత్ చైనాకు బుద్ధి చెప్పినా కూడా తీరు మార్చుకోలేదు. భారత్ ఓ వైపు కరోనా సెకండ్ విషయంలో పోరాడుతూ ఉంటే.. మరో వైపు చైనా మాత్రం సరిహద్దుల్లోకి పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపిస్తూ ఉంది.
చైనా సరిహద్దుల వద్దకు పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలించడమే కాకుండా విన్యాసాలు కూడా ప్రారంభించింది. తూర్పు లఢఖ్ సెక్టార్‌కు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చేస్తుండడాన్ని భారత్ గుర్తించింది. సరిహద్దుల మీదుగా కొన్ని గంటల్లోనే భారత్ లోకి ప్రవేశించేందుకు వీలు ఉన్న ప్రాంతాల్లో చైనా సైన్యం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలకు రోడ్లను వేసింది చైనా.. ఆయుధాలను, తమ వాహనాలను తీసుకుని వచ్చే విధంగా ప్లానింగ్ తో ఉంది. కొన్ని చోట్ల ఏకంగా గ్రామాలనే ఏర్పాటు చేసుకుంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో చైనా-భారత్ సైన్యాలు తూర్పు లఢఖ్ ప్రాంతంలో భారీగా మోహరించాయి. అప్పుడు ఎంతో ఉద్రిక్తత నెలకొంది.. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. చైనా తీరుపై ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాయి.