చిన్న కూట‌ముల‌తో ప్ర‌పంచాన్ని శాసించ‌లేరు : చైనా

China says small groups do not rule the world.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ దేశాల‌న్ని వ‌ణికిపోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2021 7:40 AM GMT
చిన్న కూట‌ముల‌తో ప్ర‌పంచాన్ని శాసించ‌లేరు : చైనా

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ దేశాల‌న్ని వ‌ణికిపోతున్నాయి. దీనికి కారణం చైనా నేన‌ని అమెరికాతో స‌హా అనేక దేశాలు ఆగ్ర‌హాంగా ఉన్నాయి. కాగా..చైనా సామ్రాజ్య‌కాంక్ష‌తో ప‌లు దేశాల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకుంటోంది. ఇప్ప‌టికే అదే దారిలో న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో చైనా ఆధిప‌త్యానికి చెక్ పెట్టేందుకు అగ్ర‌దేశాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. చైనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల కూటమి జీ-7(అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్) దేశాధినేతలు తాజాగా భేటీయ్యాయి.

ఈ నేప‌థ్యంలో జీ7 కూటమిపై చైనా రంక‌లేస్తుంది. చిన్న చిన్న కూటములతో ప్రపంచాన్ని నిర్దేశించలేరంటూ డ్రాగన్ కంట్రీ వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్‌ని ప్రపంచం మీదికి వదలడం ద్వారా యావత్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంలో పడేసిన చైనాపై జీ7 కూటమి దేశాలు పరోక్ష యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. బ్రిట‌న్‌లో జరిగిన జీ7 కూటమి సదస్సులో చైనా ఆధిపత్య నియంత్రణపై సమాలోచనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నేరుగా ప్రస్తావించని చైనా.. చిన్న చిన్న కూటములతో తమను ఏమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేసింది.

ప్రపంచ దేశాల‌కు సంబందించిన నిర్ణ‌యాల‌ను కేవ‌లం కొన్ని దేశాల‌తో కూడిన చిన్న కూట‌ములు శాసించే రోజులు పోయాయ‌ని లండ‌న్‌లోని చైనా రాయ‌బార కార్యాల‌య అధికార ప్ర‌తినిధి వ్యాఖ్యానించారు. అన్ని ప్రపంచ దేశాలను సంప్రదించిన తర్వాతనే మానవాళిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నా-పెద్దా, ధనిక-పేద, బ‌ల‌మైన‌-బ‌ల‌హీన‌మైన ఇలా అన్ని దేశాల‌ను చైనా స‌మానంగానే బావిస్తుంద‌ని చెప్పుకొచ్చారు.

Next Story