ఆ రాత్రి స్పేస్‌క్రాప్ట్‌ను ప్రయోగించిన చైనా.. మెయిన్‌గా దానిపైనే ఫోకస్.!

China launches spacecraft. షెంఝూ-13 స్పేస్‌క్రాప్ట్‌ను చైనా దేశ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది. స్పేస్‌క్రాప్ట్‌ ద్వారా ముగ్గురు వ్యోమగాములను

By అంజి  Published on  17 Oct 2021 6:09 AM GMT
ఆ రాత్రి స్పేస్‌క్రాప్ట్‌ను ప్రయోగించిన చైనా.. మెయిన్‌గా దానిపైనే ఫోకస్.!

షెంఝూ-13 స్పేస్‌క్రాప్ట్‌ను చైనా దేశ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది. స్పేస్‌క్రాప్ట్‌ ద్వారా ముగ్గురు వ్యోమగాములను స్పేస్‌ స్టేషన్‌ కోర్ మాడ్యూల్‌ తియాన్హెకి పంపించారు. వీరు ఆరు నెలల పాటు స్పేస్‌ స్టేషన్‌లో ఉండి తమ పని చేయనున్నారు. ఆరు నెలలు స్పేస్‌ స్టేషన్‌లో ఉండి రికార్డు సృష్టించనున్నారు. ఈ సంవత్సరం జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు ఉన్న కాలమే ఇప్పటి వరకు స్పేస్‌లో ఎక్కువ సమయం. అయితే ఈ రికార్డ్‌ను వీరు బ్రేక్ చేయనున్నారు. ప్రయోగించిన 9 నిమిషాల 42 సెకన్ల తర్వాత స్పేస్‌ క్రాప్ట్‌ రాకెట్‌ నుండి విడిపోయి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో ప్రయోగం విజయవంతం అయిందని సీఎంఎస్ఏ ప్రకటించింది.

ముగ్గురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లిన వారిలో స్పేస్‌లో నడిచిన మొదటి చైనీయుడు ఝూయి జిగాంగ్, మొదటి మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్, మరో వ్యోమగామి యా గుయంగ్‌ఫూలు ఉన్నారు. షెంఝూ-13 స్పేస్‌క్రాప్ట్‌ ఆటోమేటిక్‌గా స్పేస్‌ స్టేషన్‌తో అనుసంధానం అవుతుంది. స్టేషన్‌లోకి వెళ్లిన తర్వాత మెకానికల్‌ పనులను, బయటి పనులను, ట్రాన్స్‌ఫర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. స్పేస్‌లో ఎక్కువ కాలం జీవించడానికి గల సాంకేతికతను వీరు పరిశీలించనున్నారు.

Next Story