వ్యాక్సిన్ వద్దంటోన్న ప్రజలు.. గుడ్లు ఇస్తామంటున్న ప్రభుత్వం..
China government gives offers to people.కరోనా . వ్యాక్సిన్ వేయించుకుంటే గుడ్లు ఫ్రీ అని ప్రకటించింది.
By తోట వంశీ కుమార్ Published on 20 April 2021 1:08 PM ISTకరోనా వైరస్.. ఈ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ దాదాపుగా ఏదీ లేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు చేయని ప్రయత్నం అంటూ లేదు. దీనికి వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడే లోపు సెకండ్ వేవ్ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోమని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. ఇక చైనా ప్రభుత్వం కూడా ప్రజలను కాపాడేందుకు టీకాలు వేయించుకోమని చెబుతున్నప్పటికి.. ప్రజలు దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఓ వైపు ఫార్మా కంపెనీలు అన్నీ సిద్దంగా ఉన్నప్పటికీ.. చైనీయులు మాత్రం టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రజలు కరోనా టీకా వేయించుకునేలా ప్రోత్సహాకాలు ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే గుడ్లు ఫ్రీ అని ప్రకటించింది.అలాగే స్టోర్ కూపన్లు, రేషన్ పై డిస్కౌంట్లు కూడా ఇస్తోంది. ప్రస్తుతం వాక్సిన్ వేయించుకున్న వారికి బీజింగ్ హెల్త్ సెంటర్ లో దాదాపు 3 కేజీల గుడ్లను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే షాంఘై వంటినగరాల్లో షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాల్లో సైతం ఆఫర్లు వర్తింపచేస్తున్నారు. కానీ జనాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించటంలేదు. కాగా.. చైనాలో ఇప్పటి వరకు 19 కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలిన 100 కోట్లకు పైగా జనాబా ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటారా..? అన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. మరీ ప్రభుత్వం ఆఫర్ల కోసం కాకున్నా.. తమ ప్రాణాలతో పాటు పక్క వారి ప్రాణాలు రక్షించుకునేందుకైనా టీకా వేయించుకుంటే బాగుంటుంది.