గాల్వన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా కొంత నిజాన్ని ఒప్పుకుంది. నిజాన్ని పూర్తిగా అంగీకరించకపోయినా ఒక దారికొచ్చింది. ఇప్పటి వరకు గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణనే జరగలేదంటూ బుకాయించిన జిత్తుల మారి చైనా.. ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. గాల్వన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చైనా సైనికులు చాలా మంది చనిపోయారని ఇతర దేశాలు చెబుతున్నప్పటికీ ఇలాంటిదేమి లేదని అబద్దాలు చెబుతూ వస్తోంది. చనియిన వారి పేర్లను సైతం వెల్లడించింది. ఈ ఘటనలో 45 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ప్రకటించిన వారం రోజుల్లోనే ఈ విషయాన్ని బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు ప్రపంచ మీడియా ఏజన్సీలు ఇన్నాళ్లు చెబుతూ వచ్చాయి. అయితే దీనిని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాత్రం ఇప్పటి వరకు అంగీకరించలేదు. గత ఏడాది జూన్‌లో జరిగిన గాల్వన్ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారన్నది చైనా దేశం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇప్పుడేమో నలుగురు మాత్రమే అని చెబుతోంది.
వీటిపై అమెరికాతో పాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటెలిజెన్సీ నివేదికలను ఉటంకించింది. దీంతో ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తుండడంతో చైనా వెనక్కి తగ్గింది. నిజాన్ని ఒప్పుకుంది. అయితే 45 మందికి బదులుగా నలుగురు చనిపోయరని ప్రకటించడం గమనార్హం.