Bird Flu: మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి
మొట్టమొదటిసారిగా మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూడటం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు పక్షుల్లో,
By అంజి Published on 30 March 2023 4:15 PM ISTBird Flu: మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి
మొట్టమొదటిసారిగా మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూడటం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు పక్షుల్లో, జంతువుల్లో మాత్రమే కనిపించిన ఈ వైరస్.. ఇప్పుడు మనుషులకు సోకడం మొదలైంది. చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ తొలి కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 53 ఏళ్ల వయస్సు గల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపించాయని చిలీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రోగిని పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలిందని చెప్పారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి రోగి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడిని వైద్యులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. పేషెంట్‌తో పరిచయం ఉన్న ఇతరులను కూడా ప్రభుత్వం ట్రాక్ చేస్తోంది.
చిలీ దేశంలోని అడవి జంతువుల్లో గత ఏడాది హెచ్ 5 ఎన్1 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. చిలీ దేశ పారిశ్రామిక క్షేత్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం పౌల్ట్రీ ఎగుమతులను పూర్తిగా నిలిపివేసింది. అర్జెంటీనాలోని పారిశ్రామిక క్షేత్రాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ పక్షులు లేదా సముద్రపు క్షీరదాల నుంచి మానవులకు సంక్రమించవచ్చని చిలీ ఆరోగ్య అధికారులు అంటున్నారు. అయితే ఇది మనిషి నుంచి మనిషికి సంక్రమించిందా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో ఈక్వెడార్ దేశంలో పౌల్ట్రీతో సంబంధం కలిగి ఉన్న తొమ్మిదేళ్ల బాలికలో బర్డ్ ఫ్లూ మానవ సంక్రమణ కేసును గుర్తించారు. ఇక ఇలాంటి కేసులు 14 లాటిన్ అమెరికా దేశాలలో కూడా కనుగొనబడ్డాయి.