కొత్త‌రాజుగా ఛార్లెస్ -3 ప్ర‌మాణం

Charles III declared Britain's King, ends Queen's reign of 70 years. ఛార్లెస్ -3ని బ్రిట‌న్ రాజుగా అధికారికంగా ప్ర‌క‌టించారు.

By Medi Samrat  Published on  10 Sep 2022 12:45 PM GMT
కొత్త‌రాజుగా ఛార్లెస్ -3 ప్ర‌మాణం

ఛార్లెస్ -3ని బ్రిట‌న్ రాజుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అంత‌కు ముందు క్వీన్ ఎలిజ‌బెత్ అస్త‌మించిన‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. ఛార్లెస్‌-3ను రాజుగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆయ‌న స‌ద‌రు డాక్యుమెంట్‌పై సంత‌కం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 200 మంది హాజ‌రయ్యారు. బ్రిట‌న్ ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్‌తో పాటు ఆరు మంది మాజీ ప్ర‌ధానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రాజుగా ప్ర‌మాణం చేసిన కింగ్ ఛార్లెస్ త‌న త‌ల్లి మ‌ర‌ణ‌వార్త‌పై ప్ర‌క‌ట‌న చేశారు. జీవిత కాలం ప్రేమ‌ను పంచాల‌ని, నిస్వార్థ సేవ చేయాల‌ని త‌న త‌ల్లి త‌న‌కు నేర్పిన‌ట్లు ఛార్లెస్ తెలిపారు. త‌న త‌ల్లి రాజ్యాన్ని ఏలిన స‌మ‌యం, ఆమె అంకిత భావం, ఆమె భ‌క్తి అసాధార‌ణ‌మైన‌వ‌ని అన్నారు.

కింగ్ చార్లెస్-III పేరుతో కొనసాగనున్నారు. దీంతో ఛార్లెస్ సతీమణి కెమిల్లాకు రాణి హోదా వచ్చింది. ఈ ఏడాది 70 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో బ్రిటన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లోనూ ప్రసంగించిన ఎలిజబెత్‌-II తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి అని తెలిపింది. ఎలిజబెత్‌-II మృతి చెందిన 10 రోజుల వరకు ఆమె అంత్యక్రియలు నిర్వహించరు. సెప్టెంబరు 19న అంత్యక్రియలు జరుగుతాయని ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఆ సమయంలో రాణి పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచుతారు.


Next Story