నగ్నంగా జూమ్ కాల్ లో కనిపించిన ఎంపీ..!

Canadian lawmaker caught naked during video conference. తాజాగా జూమ్ కాల్ లో నగ్నంగా కనిపించేశాడు ఎంపీ. అయితే ఈ ఘటన మన దగ్గర చోటు చేసుకుంది కాదులెండి.. కెనడాలో.

By Medi Samrat
Published on : 16 April 2021 12:09 PM IST

Canadian lawmaker

జూమ్ కాల్స్.. ఇటీవలి కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో మీటింగ్స్ కోసం జూమ్ కాల్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. చిన్న చిన్న మీటింగ్స్ దగ్గర నుండి అధికారిక మీటింగ్స్ వరకూ వర్చువల్ మీటింగ్స్ ద్వారా పని కానిచ్చేస్తూ ఉన్నారు. తాజాగా జూమ్ కాల్ లో నగ్నంగా కనిపించేశాడు ఎంపీ. అయితే ఈ ఘటన మన దగ్గర చోటు చేసుకుంది కాదులెండి.. కెనడాలో..!

కెనడాలో క్యూబెక్ జిల్లాలోని పోంటియాక్ కు 2015 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విలియం అమోస్ బుధవారం నాడు జూమ్ కాల్ లో ఇతర ఎంపీలతో కలిసి పాల్గొన్నాడు. అయితే ఈ సమయంలో అతడు నగ్నంగా కనిపించడం సంచలనం రేపింది. ఈ సమావేశానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కెనెడా ప్రెస్ బయటపెట్టింది.

తన వీడియో కాల్ అనుకోకుండా ఆన్ అయిపోయిందని.. అప్పటిదాకా తాను జాగింగ్ డ్రెస్ లో ఉన్నానని.. మీటింగ్ కోసం రెడీ అవ్వాలని అనుకునే సమయానికి ఇలా జరిగిందని.. తనను క్షమించాలని కోరుతూ విలియం అమోస్ తెలిపారు. తన తోటి నాయకులకు కూడా క్షమాపణలు చెబుతూ ఉన్నానని.. ఇలాంటిది మరోసారి జరగదని తెలిపారు విలియం అమోస్.

విలియం అమోస్ కావాలని ఈ పని చేయలేదని సదరు సభ్యులు కూడా గుర్తించి అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. అయితే పార్లమెంట్ సభ్యులు మైక్రో ఫోన్, కెమెరా వంటి వాటిని వాడే సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇకపై మీటింగ్ సమయాల్లో మగ పార్లమెంట్ సభ్యులు జాకెట్, టై, షర్ట్, అండర్ వేర్, ట్రౌజర్లు తప్పనిసరిగా వేసుకోవాలని మిగిలిన వాళ్ళు సూచించారు.






Next Story