గేదె మాంసంలో కరోనా మూలాలు.. మూడు కంటైనర్ల నిలిపివేత
Cambodia seizes virus-contaminated meat imported from India.కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.
By తోట వంశీ కుమార్ Published on
28 July 2021 8:09 AM GMT

కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే.. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చిన మాంసం కంటెనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు తెలిపింది. ఓ ప్రైవేటు సంస్థ రవాణా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.
భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరలా దిగుమతులకు ఓకే చెప్పింది. భారతదేశంలో ఉన్న వస్తువులు, ఇతరత్రా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ నుంచి గేదె మాంసం కంటైనర్లలో కంబోడియాకు ఎగుమతి అయ్యాయి. ఈ మాంసంలో కరోనా మూలాలు ఉన్నట్లు నిర్ధారించడంతో మూడు కంటైనర్లను నిలిపివేసింది. ఇందులోని మాంస పదార్థాలను వారం తరువాత నాశనం చేస్తామని తెలిపారు.
Next Story