'వాళ్ల‌కు ఇంగ్లీషు రాదు.. బ్రిటన్ నుంచి బహిష్కరించండి'.. బ్రిటిష్ మహిళ పోస్ట్‌పై దుమారం

దేశంలో ప్ర‌స్తుతం మరాఠీ vs మరాఠీయేతర భాషా వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే, బ్రిటన్‌లో కూడా భాష విషయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.

By Medi Samrat
Published on : 8 July 2025 6:46 PM IST

వాళ్ల‌కు ఇంగ్లీషు రాదు.. బ్రిటన్ నుంచి బహిష్కరించండి.. బ్రిటిష్ మహిళ పోస్ట్‌పై దుమారం

దేశంలో ప్ర‌స్తుతం మరాఠీ vs మరాఠీయేతర భాషా వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే, బ్రిటన్‌లో కూడా భాష విషయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వివాదానికి భారత్‌తో సంబంధం ఉంది. లూసీ వైట్ అనే బ్రిటీష్ మహిళ తాను లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్ల‌గా అక్క‌డ భారతీయ మరియు ఆసియా సంతతికి చెందిన ఉద్యోగులు తనతో ఇంగ్లీష్‌లో మాట్లాడలేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పోస్ట్ చేసింది. లూసీ సిబ్బందిని ఇంగ్లీష్ మాట్లాడమని అభ్యర్థించినప్పుడు ఆమెను జాత్యహంకారిగా పిలిచారు.

ట్విట్టర్‌లో మొత్తం సమాచారాన్ని పంచుకున్న లూసీ.. విమానాశ్రయంలో ఉన్న అధికారులకు నేను చెప్పింది నిజమని తెలుసు, అందుకే వారు నన్ను జాత్యహంకారిగా పిలిచారు. ఈ అధికారులను బ్రిటన్ నుంచి బహిష్కరించాలని లూసీ అన్నారు. బ్రిటన్‌లో ఏం చేస్తున్నారు? మన దేశానికి వచ్చే పర్యాటకులు ఏమనుకుంటారు? అని యంత్రాగాన్ని ప్రశ్నించింది.

అయితే ఆమె పోస్ట్‌పై చాలా మంది వినియోగదారులు.. లూసీ క్లెయిమ్ చేస్తున్నది తప్పు అని పేర్కొన్నారు. హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఉద్యోగులు కేవలం ఇంగ్లీషు భాషను మాత్రమే ఉపయోగిస్తున్నారని చాలా మంది చెప్పారు. లూసీ మాటలు కల్పితమైనవిగా అనిపిస్తున్నాయ‌న్నారు.

అదే సమయంలో ఒక వినియోగదారు.. వారు ఇంగ్లీష్ మాట్లాడటం లేదు, కానీ వారు మీ భాష అర్థం చేసుకున్నారు.. ఆంగ్లంలో మిమ్మల్ని జాత్యహంకారిగా కూడా పిలిచారు. ఇది ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశాడు.


Next Story