ఇండోనేషియాలో విమానం అదృశ్యం.. 62 మంది ప్ర‌యాణీకులు

Boeing plane goes missing in Indonesia.ఇండోనేషియాలో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2021 12:44 PM GMT
Indonesia plane

ఇండోనేషియాలో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. ప్ర‌యాణీల‌కులతో వెలుతున్న విమానం అదృశ్యం కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇండోనేషియాలోనే మూడో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌‌కు చెందిన బోయింగ్ విమానం737-500.. జకర్తా ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. 62 మంది ఆ విమానంలో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. రాడార్ స‌మాచారాన్ని విశ్లేషిస్తున్న‌ట్లు ఇండోనేషియా ర‌వాణా మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి అదిత ఇరావ‌తి తెలిపారు. నేష‌న‌ల్ సెర్చ్ అండ్ రెస్య్కూ ఏజెన్నీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ క‌మిటీ ప‌ర‌స్ప‌ర స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నాయ‌ని అన్నారు.

టేకాఫ్ అయిన విమానం నిమిషంలో 10 వేల అడుగుల కిందకు జారినట్లు రాడార్ ద్వారా తెలిసింది. కాలిమంటన్ నుంచి పోంటియానక్‌కు వెళ్లే దిశలోనే విమానం కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ విమానంలో 56 మంది ప్ర‌యాణికులు ఆరుగురు సిబ్బందితో క‌లిపి మొత్తంగా 62 మంది ఉన్న‌ట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఓ నిర్జ‌న ద్వీపంలో ఈ విమానం కూలిపోయి ఉండొచ్చున‌ని స్థానిక మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ విమానం 27 ఏళ్ల నాటిదిగా గుర్తించారు.




Next Story