మునిగిన లాంచి 27మంది ప్రాణాలు తీసింది

Boat accident in bangladesh.తాజాగా బంగ్లాదేశ్‌లోని షితాలక్య నదిలో బోటు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 3:07 AM GMT
Boat accident

ఒకవైపు కరోనా ప్రపంచాన్ని నానా తిప్పలు పెడుతుండగా.. మరోవైపు ప్రమాదాలు, ప్రకృతీ వైపరీత్యాలు జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని షితాలక్య నదిలో బోటు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. వంద మందికి పైగా ప్రయాణికులను తీసుకెళుతున్న బోటు కార్గో నౌకను ఢీ కొన్న తర్వాత నదిలో తిరిగబడడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఢాకాకు 16 కిలోమీటర్ల దూరంలోని నారాయణ్‌గంజ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆదివారమే ఐదు మృతదేహాలను వెలికి తీశారు. సోమవారం మరో 22మంది మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 27కి పెరిగింది. కొంతమంది ఈతకొడుతూ ఒడ్డుకు చేరుకున్నారని వాటర్ ట్రాన్స్ పోర్టు అథారిటీ అధికారులు చెబుతున్నారు. భారీ క్రేన్‌ సాయంతో బోటును కూడా నదిలో నుండి వెలికి తీశారని అధికారులు తెలిపారు. ఢీ కొట్టిన తర్వాత కార్గో నౌక ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిందని ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తుకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ నేతృత్వాన ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. భద్రతా నిబంధనలు పాటించక పోవడం వల్లనే నదుల్లో లాంచీల ప్రమాదాలు జరుగుతున్నాయని బంగ్లాదేశ్ ప్రజలంటున్నారు.


Next Story