జైలు నుంచి విడుదలైన బికినీ కిల్లర్ 'చార్లెస్ శోభరాజ్‌'

Bikini killer Charles Sobhraj freed from Nepal prison. ఖాట్మండు: నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ''సర్పెంట్ కిల్లర్'', ''బికినీ కిల్లర్''గా

By అంజి  Published on  23 Dec 2022 10:10 AM GMT
జైలు నుంచి విడుదలైన బికినీ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌

ఖాట్మండు: నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ''సర్పెంట్ కిల్లర్'', ''బికినీ కిల్లర్''గా పేరుగాంచిన చెందిన చార్లెస్ శోభరాజ్ (77) జైలు నుండి విడుదలయ్యారు. వివిధ కారణాల వల్ల శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. శోభరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సపాన ప్రధాన్ మల్లా, టిల్ ప్రసాద్ శ్రేష్ఠతో కూడిన ఉమ్మడి ధర్మాసనం, మరో కేసులో జైలుకు వెళ్లనవసరం లేకుంటే అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా ఫ్రెంచ్ పౌరుడిని తన దేశానికి తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.

అతను చాలా కాలం క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ రాజకీయ వ్యూహాల కారణంగా అది ఆలస్యమైందని, అతనికి కాబోయే భార్యగా పేరుగాంచిన నిహితా బిస్వాస్, సెంట్రల్ జైలు నుండి విడుదలకు ముందు ఖాట్మండులో విలేకరులతో అన్నారు. అతను ఐదేళ్ల క్రితమే విడుదల చేయబడాలి, కానీ అది జరగలేదని నిహితా బిశ్వాస్ అన్నారు. చార్లెస్ శోభరాజ్ ఖాట్మండులోని సెంట్రల్ జైలులో 19 సంవత్సరాల రెండు నెలలు గడిపాడు. సెంట్రల్ జైలు అతన్ని గురువారం విడుదల చేసినప్పటికీ, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో డాక్యుమెంటేషన్ ప్రక్రియతో సహా కొన్ని అంతర్గత ప్రక్రియల కారణంగా, అతని విడుదల శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే సాధ్యమని అధికారులు తెలిపారు.

అయితే అన్ని ప్రక్రియలు పూర్తయితే ఈరోజే శోభరాజ్ ఫ్రాన్స్‌కు బయలుదేరుతానని బిశ్వాస్ తెలిపారు. విడుదలైన తర్వాత నేపాల్‌లో మరికొన్ని రోజులు జీవించాలని శోభరాజ్ తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ, అది 15 రోజులకు మించకూడదని ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. నేపాల్‌లో ఉంటూ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వనని శోభరాజ్ తన లాయర్లకు చెప్పారు. నేపాల్‌కు తిరిగి రావడానికి అనుమతించకూడదనేది అతని విడుదల యొక్క షరతు.

శోభరాజ్‌.. భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించాడు. అతడి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత తల్లి రెండో భర్త అతన్ని దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత శోభరాజును నిర్లక్ష్యం చేశాడు. దీంతో శోభరాజు నేరాల బాటపట్టాడు. 1970లో వరుస హత్యలు, దోపిడీలతో అతడి పేరు మార్మోగింది. అతడిపై 20కిపైగా హత్య కేసులో ఉన్నాయి. భారత్‌లోని ఢిల్లీలో ఓ ఫ్రెంచ్‌ పౌరుడికి విషం ఇచ్చి చంపాడు. 1996లో, పట్టాయాలోని బీచ్‌లో బికినీలు ధరించిన ఆరుగురు బాలికలను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ఆసియా, యూరోప్‌లో జ‌రిగిన అనేక నేరాల్లో శోభ‌రాజ్ నిందితుడు. నేపాల్ పోలీసులు 2003 సెప్టెంబర్‌లో శోభరాజ్‌ను ఫైవ్ స్టార్ హోటల్ నుండి అరెస్టు చేశారు.

Next Story