సైకిళ్ల శ్మశానం.. అక్కడివారికి తలనొప్పిగా మారి..!
Bicycles crematorium in Japan. టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో ఉన్న దేశాల్లో ఒకటైన జపాన్‌కు పెద్ద సమస్య వచ్చి పడింది.
By అంజి Published on 13 Oct 2021 5:10 PM ISTటెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో ఉన్న దేశాల్లో ఒకటైన జపాన్‌కు పెద్ద సమస్య వచ్చి పడింది. విస్తీర్ణం పరంగా జపాన్ చిన్న దేశం కావడంతో అక్కడి ప్రజలకు స్థలం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లులు కట్టుకునేందుకు కూడా ప్రస్తుతం స్థలం దొరకలేని పరిస్థితి. అలాంటి దేశంలో పనికిరాని వస్తువులను పడేయం అక్కడి ప్రజలకు తలనొప్పిగా మారింది. చెడిపోయిన సైకిళ్ళు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. సైకిళ్లను ఇంట్లో ఉంచుకునేంత స్థలం లేకపోవడంతో యార్డుల్లో కుప్పలు కుప్పులగా పడేస్తున్నారు. యార్డులో సైకిళ్లు కుప్పులు తెప్పలుగా ఉండడంతో.. అది కాస్తా సైకిళ్ల శ్మశానంగా తయారైంది. జపాన్ ప్రజలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ప్రయాణంలో కూడా ఎక్కువగా సైకిళ్లను వాడుతుంటారు.
అక్కడి ప్రజలకు సైకిల్ ఒక ప్రియమైన వస్తువు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు చౌకధరల్లో ప్రయాణం చేసేందుకు సైకిళ్లను ఉపయోగిస్తారు. అలాగే పరిసరాలను క్లీన్‌గా ఉంచేలా చూసుకుంటారు. జపాన్‌లో దాదాపు 80 మిలియన్లకుపైగా సైకిళ్లు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా సైకిళ్ల వినియోగం తగ్గుముఖం పడుతూ వస్తోంది. దీంతో సైకిళ్లను ఇంట్లో ఉంచుకునేందుకు ఖాళీ స్థలం లేకపోవడంతో వాటిని యార్డుల్లో పడేస్తున్నారు. సైతామా నగరంలో దాదాపు 70 వేల సైకిళ్లను యార్డులో పడేశారు. దీంతో అది ఒక మినీ సైకిల్ శ్మశానంగా తయారైంది. యార్డులో పడేసిన సైకిళ్లలో చిన్న పిల్లల సైకిళ్ల నుంచి పెద్ద పిల్లల సైకిళ్ల వరకు ఉన్నాయి. యార్డులో పడేస్తున్న కుప్పలు కుప్పలుగా పడేస్తున్న సైకిళ్లపై సైతామా మేయర్ హయాటో షిమిజు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన వారికి సైకిళ్లను.. డంప్ చేయొద్దని అక్కడి ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.