భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతల నుంచి పూర్తిగా తేరుకోకముందే, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని పాకిస్తాన్‌పై పోరాడుతున్న బలూచ్ తెగల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారు స్వతంత్ర దేశంగా తమను తాము ప్రకటించుకున్నారు.
అయితే ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్మీ వాహనాలపై బలూచిస్థాన్ లిబరేషన్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 14 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఈ దాడి మే9వ తేదీన పంజ్‌గర్‌లో జరిగినట్లు తెలిపింది. ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేశాం. చాలా మంది పాక్ సైనికులు గాయపడ్డారు. వాహనాలు ధ్వంసం చేశాం..అని బలూచిస్థాన్ ఆర్మీ ప్రకటించింది.