ఆస్ట్రేలియ‌న్ల‌ను ఇబ్బంది పెడుతున్న ఎలుక‌లు.. భార‌త్ నుంచి విషం కొనుగోలు..!

Australia Country seeks banned poison from India to fight plague.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌ను ఇప్పుడు ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2021 3:49 PM IST
ఆస్ట్రేలియ‌న్ల‌ను ఇబ్బంది పెడుతున్న ఎలుక‌లు.. భార‌త్ నుంచి విషం కొనుగోలు..!

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌ను ఇప్పుడు ఓ కొత్త స‌మ‌స్య వేధిస్తోంది. న్యూ సౌత్ వేల్స్‌ని రాష్ట్రంలో ఎలుక‌లు దండ‌యాత్ర చేస్తున్న‌ట్లే ఉంది ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి. ఇబ్బడి ముబ్బ‌డిగా మూషిక సంత‌తి పెరిగిపోయి జ‌న జీవ‌నానికి ఇబ్బంది క‌లిగిస్తోంది. పంటపొలాలు, నివాస గృహాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు... ఇలా ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. ఎలుక‌ల బెడ‌ద‌తో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. దీంతో ఎలుకలను చంపేందుకు నిషేధంలో ఉన్న బ్రోమాడియోలోన్ విషాన్ని భారత్‌ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్దమైంది న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం.

5 వేల లీటర్ల పాయిజన్ కొనుగోలు కోసం ఆర్డర్ చేసింది. ఎలుకల పాయిజన్ వేగంగా రవాణా చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,600 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఈ ప్రతిపాదనను అక్కడి ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. అత్యంత విషపూరితమైనది కావడంతో వీటి వినియోగంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు, వరదల వంటి విపత్తులతో ఇప్పటికే నష్టపోయిన ఆస్ట్రేలియాను ఇప్పుడీ ఎలుకల బెడద మరింత వేధిస్తోంది.

Next Story