సైనిక పాలనలో ఉన్న చైనాలో రక్తపాతం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సైన్యం ఎంతో మందిని చంపుకుంటూ వెళుతోంది. ప్రజలు ఏమి జరుగుతోందా అని ఆలోచించే సమయంలోనే.. మయన్మార్ సైన్యం దాడులు జరుపుతూ ఉంది. సైన్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఏ మాత్రం కనికరం చూపకుండా శిక్షిస్తోంది. ఓ వైపు అరెస్టులు.. మరోవైపు చంపుకుంటూ వెళుతోంది మయన్మార్ సైన్యం. భద్రతాబలగాలు జరిపిన తాజా కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్ లోని ప్రధాన నగరమైన హ్లెయింగ్తాయా ఇండస్ట్రియల్ ఏరియాలో చైనా ఫైనాన్స్ చేస్తోన్న ఫ్యాక్టరీలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో మయన్మార్ మిలిటరీ తూటాల వర్షం కురిపించింది. దీంతో బలగాలు జరిపిన కాల్పుల్లో 22 మంది చనిపోయారు. ఇతర ప్రాంతాల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ సైన్యం కాల్పుల్లో 126 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. 2150 మందిని ఇప్పటి దాకా సైన్యం అధీనంలోకి తీసుకుంది. 300 మందికి పైగా విడుదల చేసింది.
ఈ ఘటనపై మయన్నార్ లోని చైనా దౌత్యకార్యాలయం స్పందిస్తూ, నిరసనకారుల దాడుల్లో పలువురు చైనా సిబ్బంది గాయపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ప్రజలు, ఆస్తులను మయన్మార్ కాపాడాలని కోరింది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షించాలని చైనా కోరుతోంది. మయన్మార్ ను హస్తగతం చేసుకున్న సైన్యానికి చైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుండడంతో.. ఆ దేశం లోని నిరసనకారులు చైనా పెట్టుబడులు ఉన్న ఫ్యాక్టరీలను, సంస్థలను టార్గెట్ చేస్తూ వచ్చారు.
సైన్యం ప్రజలను కాల్చడం నా కళ్లారా చూశానని.. నా కళ్ల ముందే ప్రజలను కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని ఫోటో జర్నలిస్టు మీడియాకు తెలిపారు. ఇలా దాడులకు పాల్పడిన వారంతా దేశ ప్రజలకు శత్రువులే అని.. ఆందోళనలు చేపట్టేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని సైన్యం హెచ్చరించింది.