ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. ముగ్గురు మృతి, 50 మందికిపైగా తీవ్ర‌గాయాలు

At least 3 dead after Amtrak passenger train derails in Montana.అమెరికాలో ఓ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2021 5:19 AM GMT
ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. ముగ్గురు మృతి, 50 మందికిపైగా  తీవ్ర‌గాయాలు

అమెరికాలో ఓ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెంద‌గా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఈ ఘ‌ట‌న మోంటానాలో శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఐదు బోగోలు ప‌ట్టాల నుంచి ప‌క్క‌కు ఒరిగాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంపై లిబర్టీ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారి మాట్లాడుతూ.. సీటెల్ మరియు చికాగో మ‌ధ్య న‌డుస్తున్న ఆమ్‌ట్రాక్(అమెరికా జాతీయ రైల్వే)కు చెందిన ఎంఫైర్ బిల్డ‌ర్ రైలు జోప్లిన్ సమీపంలో శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ప‌ట్టాలు త‌ప్పింద‌న్నారు. ఈ రైలుకు రెండో లోకోమోటీవ్‌లు, 10 బోగీలు ఉన్నాయని.. ప్ర‌మాద స‌మ‌యంలో రైలులో 147 మంది ప్ర‌యాణీకుల‌తో పాటు 13 మంది సిబ్బంది ఉన్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం ముగ్గురు మ‌ర‌ణించార‌ని 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. కాగా.. రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని.. దీనిపై నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

సీటెల్‌లోని స్నేహితుడిని చూడటానికి వెళ్తున్న రైలులోని మేగాన్ వాండర్‌వెస్ట్ అనే ప్రయాణికురాలు.. ఓ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పింది. రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతోనే తాను మేల్కొన్నాన‌ని చెప్పింది. తొలుత విష‌యం తెలిసి చాలా ఆందోళ‌న చెందాన‌ని తెలిపింది. ఎందుకంటే తాను రైలు ప‌ట్టాలు త‌ప్పిన సంఘ‌ట‌న‌ల గురించి ఎన్నో వినిఉండ‌డంతో చాలా కంగారు మొద‌లైంద‌న్నారు. ఇక నా రెండో ఆలోచ‌న ఏంటంటే.. ప్ర‌తిసారి అలానే జ‌ర‌గాల‌ని ఏమీ లేదు క‌దా.. మేము క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డామ‌ని చెప్పింది.

కాగా.. ఈ ప్ర‌మాదానికి సంభందించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


Next Story