బస్సు బోల్తా.. 20మంది దుర్మరణం
At least 20 killed in bus accident in Peru. పెరూ దేశంలో ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం. .
By Medi Samrat Published on
13 April 2021 3:38 AM GMT

పెరూ దేశంలో ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు మరణించారు. దేశంలోని సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ సాధారణ ఎన్నికల్లో ఓటు వేసి.. తిరుగుప్రయాణం బస్సులో వస్తుండగా ప్రమాదం జరిగింది. హుటాహుటిన ప్రమాద స్థలానికి వచ్చిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story