బద్దలైన అగ్నిపర్వతం.. 13 మంది దుర్మ‌ర‌ణం

At least 13 dead after Indonesia's Mount Semeru volcano erupts.ఇండోనేషియాలో అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైంది. ఈ ఘ‌ట‌న‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Dec 2021 7:01 AM GMT
బద్దలైన అగ్నిపర్వతం.. 13 మంది దుర్మ‌ర‌ణం

ఇండోనేషియాలో అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైంది. ఈ ఘ‌ట‌న‌లో 13 మంది మృత్యువాత పడ‌గా.. 90 మంది గాయ‌ప‌డ్డారు. మ‌రో ఏడుగురు అదృశ్య‌మ‌య్యారు. శ‌నివారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత జావా ద్వీపంలోని అత్తి ఎత్తైన(3600 మీట‌ర్ల‌) సెమెరు అగ్నిప‌ర్వ‌తం విస్పోట‌నం చెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దీంతో ఆకాశంలో 12,000 మీట‌ర్ల ఎత్తున బూడిన ఎగ‌జిమ్మింది. పెద్ద ఎత్తున గ్యాస్, లావా ఉబికి వ‌చ్చాయి. స‌మీపంలోని న‌దిలో 800 మీట‌ర్ల దూరం లావా ప్ర‌వ‌హించింది. ప‌లుగ్రామాల‌పైనా బూడిద క‌మ్ముకుంది. దీంతో ప్ర‌జ‌లు భయాందోళ‌న‌కు గురైయ్యారు.

ఎడ‌తెరిపి లేని వ‌ర్షం కార‌ణంగా అగ్నిప‌ర్వ‌తం ఒక్క‌సారిగా బ‌ద్ద‌లైంద‌ని జియోలాజికల్ సర్వే సెంటర్​ అధిపతి ఈకో బుది లియోల్నో చెప్పారు. వ‌ర్షం, బూడిద కార‌ణంగా భారీగా బుర‌ద పేరుకుపోయింద‌ని తెలిపారు. ప్ర‌భావిత గ్రామాల్లోని 900 మందికిపైగా ప్ర‌జ‌ల్ని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని ఇండోనేషియా డిజాస్టర్‌ మైటిగేషన్‌ ఏజెన్సీ అధికారి అబ్దుల్‌ ముహారి చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది మర‌ణించార‌న్నారు. 90 మంది గాయ‌ప‌డ్డార‌న్నారు. వారిలో 57 మందిని ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌న్నారు. వీరిలో 16 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

సెమెరు అగ్నిప‌ర్వ‌తం విస్పోటనానికి సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. ఇండోనేషియాలో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. అందుకనే ఇండోనేషియాను 'పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌'గా పిలుస్తారు.

Next Story