ఇరాక్‌లోని తూర్పు బాగ్దాద్‌లో శనివారం జరిగిన పేలుడులో 10 మంది మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.
ఫుట్‌బాల్ స్టేడియం, కేఫ్ సమీపంలో పేలుడు సంభవించింది. పార్కింగ్‌లో ఉంచిన వాహనానికి అమర్చిన పేలుడు పదార్థం పేలింది. మంటలు సమీపంలో ఉన్న గ్యాస్ ట్యాంకర్ వ్యాపించడంతో అది కూడా పేలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతాబలగాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారంతా రోజూ పుట్‌బాల్ ఆడేందుకు వచ్చే యువకులేనని భద్రతా బలగాలు తెలిపాయి. కాగా.. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసం అయ్యాయి. పార్కింగ్‌లో ఉన్నవాహనాలు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. "మేము ఇంట్లో ఉన్నాము. పెద్ద శబ్ధంతో పేలుడు చోటు చేసుకుంది. గ్యాస్ వాసన కూడా వచ్చింది. మా ఇంటి కిటీకీ తలుపులు, కిటికీలు ఊడిపోయాయి. " అని పేలుడు జరిగిన ప్రదేశం నుండి కేవలం 100 మీటర్ల (గజాలు) దూరంలో నివసిస్తున్న స్థానిక నివాసి మహ్మద్ అజీజ్ చెప్పారు.