రెచ్చిపోయిన డ్రగ్స్‌ ముఠా.. తుపాకీ కాల్పుల్లో 10 మంది మృతి

At Least 10 Killed In Shooting At Pool Hall In Mexico. మెక్సికో దేశంలో డ్రగ్స్‌ ముఠా రెచ్చిపోయింది. పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగింది. దీంతో 10 మంది

By అంజి  Published on  23 Sep 2022 4:11 AM GMT
రెచ్చిపోయిన డ్రగ్స్‌ ముఠా.. తుపాకీ కాల్పుల్లో 10 మంది మృతి

మెక్సికో దేశంలో డ్రగ్స్‌ ముఠా రెచ్చిపోయింది. పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగింది. దీంతో 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గ్వానాజువాటో రాష్ట్రంలోని తరిమోరో పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని పూల్‌ హాల్‌పై డ్రగ్స్‌ ముఠా దాడికి పాల్పడింది. తుపాకులతో కాల్పులు జరపడంతో ఘటనా స్థలంలో తొమ్మిది మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఈ దారుణ ఘటనను గ్వానాజువాటో గవర్నర్‌ డియెగో సిన్హ్యూ రోడ్రిగ్జ్ తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు.

మాదకద్రవ్యాల గ్రూపుల మధ్య గొడవ కారణంగా.. సాయుధ దాడిదారులు 10 మందిని చంపినట్లు అధికారులు గురువారం తెలిపారు. తారిమోరో మునిసిపాలిటీలో బుధవారం రాత్రి ఈ ఊచకోత జరిగింది. శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూ జనరేషన్ అనే రెండు గ్రూపుల మధ్య వివాదం కారణంగా గ్వానాజువాటో మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో ఒకటిగా మారింది. ఇక్కడ డ్రగ్స్, దొంగిలించబడిన ఇంధనాల అక్రమ రవాణా నియంత్రణ కోసం స్థానిక ప్రభుత్వం నిత్యం పోరాడుతోంది.

అయినా గ్వానాజువాటోలో నిత్యం హింస చోటుచేసుకుంటునే ఉంటుంది. ఇక్కడ తుపాకీ కాల్పుల మోత కామన్‌గా మారింది. ఈనేపథ్యంలో డ్రగ్‌ మఫియాను కట్టడిచేయడానికి ప్రభుత్వం మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించింది. వ్యవస్థీకృత నేరాల కారణంగానే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు. డిసెంబరు 2006 నుండి, ప్రభుత్వం వివాదాస్పద మాదకద్రవ్యాల వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించినప్పటి నుండి, అధికారిక గణాంకాల ప్రకారం మెక్సికోలో 3,40,000 కంటే ఎక్కువ హత్యలు నమోదయ్యాయి.

Next Story