కాల్పుల మోత‌తో దద్ద‌రిల్లిన అగ్రరాజ్యం.. 10 మంది మృతి

At least 10 dead in mass shooting at Buffalo.అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోసారి కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. ఓ సూప‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2022 3:59 AM GMT
కాల్పుల మోత‌తో దద్ద‌రిల్లిన అగ్రరాజ్యం.. 10 మంది మృతి

అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోసారి కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. ఓ సూప‌ర్ మార్కెట్‌లో దుండ‌గుడు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో 10 మంది మృతి చెంద‌గా..మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న్యూయార్క్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లోకి సైనిక దుస్తులు ధ‌రించిన 18 ఏండ్ల యువకుడు టాప్స్‌ ఫ్రెండ్లీ వ‌చ్చాడు. అందులో ఉన్న వారిపై ఒక్కసారిగా అత‌డు తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దీంతో పదిమంది దుర్మరణం చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. దుండ‌గుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. న‌ల్ల‌జాతీయులు అధికంగా ఉన్న చోట ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. కాల్పుల ఘ‌ట‌న‌కు జాతి విద్వేష‌మే కార‌ణ‌మ‌ని వారు బావిస్తున్నారు. నిందితుడు కాల్పుల ఘటనను హెల్‌మెట్‌కు అమర్చిన కెమెరాతో లైవ్‌ స్ట్రీమ్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు.

Next Story