సైనిక విమానానికి ప్రమాదం.. 46 మంది సజీవదహనం

సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 46 మంది సజీవదహనం అయ్యారు.

By Knakam Karthik  Published on  26 Feb 2025 3:23 PM IST
Inernational News, Plance Crashed, Viral Video, Sudan,

సైనిక విమానానికి ప్రమాదం.. 46 మంది సజీవదహనం

సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 46 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుందని అక్కడి మీడియా వెల్లడించింది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ సైనిక విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో సైనిక సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Next Story