93 ఏళ్ల వయస్సులో వృద్ధుడి నాలుగో పెళ్లి.. భార్య ఎవరో తెలుసా?

American former astronaut Buzz Aldrin got married for the fourth time at the age of 93. అమెరికాకు చెందిన మాజీ వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ 93 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి

By అంజి
Published on : 22 Jan 2023 3:48 PM IST

93 ఏళ్ల వయస్సులో వృద్ధుడి నాలుగో పెళ్లి.. భార్య ఎవరో తెలుసా?

అమెరికాకు చెందిన మాజీ వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ 93 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకున్నారు. అతని భార్య అతని కంటే 30 సంవత్సరాలు చిన్నది. ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆల్డ్రిన్ సాధారణ వ్యోమగామి కాదు. అతడు చంద్రునిపై అడుగు పెట్టిన ప్రపంచంలో రెండవ వ్యక్తి. 1969లో చంద్రునిపై దిగిన అపోలో 11 మిషన్ సిబ్బందిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఆల్డ్రిన్ మాత్రమే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నాడు. జనవరి 20న ఆయన 93వ ఏట అడుగుపెట్టారు. ఇప్పుడు తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆల్డ్రిన్ తన దీర్ఘకాల ప్రేమ అయిన డాక్టర్ అంకా ఫాక్‌ను ఒక చిన్న వేడుకలో వివాహం చేసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతను పోస్ట్‌లో ఇలా వ్రాశాడు.. ''నా 93వ పుట్టినరోజు. లివింగ్ లెజెండ్స్ ఆఫ్ ఏవియేషన్‌చే నన్ను కూడా సత్కరించే రోజు, నా చిరకాల ప్రేమ డాక్టర్ అంకా ఫర్, నేను వివాహం చేసుకున్నామని ప్రకటించడం సంతోషంగా ఉంది'' అని తెలిపారు. 'మేము లాస్ ఏంజిల్స్‌లో ఒక చిన్న ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాము. మేము యుక్తవయసులో ఉన్నంత ఉత్సాహంగా ఉన్నాము' అని ఆల్డ్రిన్‌ చెప్పాడు.

ఆల్డ్రిన్ నాల్గవ భార్య వయస్సు 63 సంవత్సరాలు. ఆమె బజ్ ఆల్డ్రిన్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. బజ్ ఆల్డ్రిన్ 1969లో చారిత్రాత్మక అపోలో 11 మూన్ ల్యాండింగ్‌లో భాగం. తోటి వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో కలిసి చంద్రునిపై నడుస్తున్నప్పుడు అతను ధరించిన జాకెట్ గతేడాది 2.7 మిలియన్ డాలర్లకు వేలం వేయబడింది. సోషల్ మీడియాలో ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Next Story