అల్‌ఖైదా అగ్రనేత అల్ జవహరీ హతం.!
America killed al-Qaeda leader Al-Zawahari. అల్‌ఖైదా అగ్రనేత అల్ జవహరీని అమెరికా హతమార్చినట్టు తెలుస్తోంది. ఆప్ఘానిస్తాన్ కేపిటల్ సిటీ కాబుల్‌లో జరిపిన
By అంజి Published on 2 Aug 2022 7:33 AM ISTఅల్‌ఖైదా అగ్రనేత అల్ జవహరీని అమెరికా హతమార్చినట్టు తెలుస్తోంది. ఆప్ఘానిస్తాన్ కేపిటల్ సిటీ కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్ జవహరీని మట్టుబెట్టినట్లు అమెరికా అధికారు ఒకరు చెప్పారు. దీంతో అమెరికాకు చెందిన మీడియా సంస్థలు వార్తలు వెలువరిస్తున్నాయి. మరోవైపు ఆప్ఘానిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికా టైమ్ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఆపరేషన్ వివరాలను వెల్లడించనున్నట్లు వివరించింది.
ఇదిలా ఉంటే.. కాబూల్‌లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ ఇంటిపై వైమానిక దాడి జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ట్వీట్ చేశాడు. ఈ దాడిని అతడు ఖండిస్తూ.. అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించాడు. తాలిబన్ ప్రతినిధి ట్వీట్ చూస్తుంటే.. అల్ జవహరీ హతమైనట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
Tonight at 7:30 PM ET, President Biden will deliver remarks on a successful counterterrorism operation.
— The White House (@WhiteHouse) August 1, 2022
ప్రపంచలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రిరిస్టుల్లో ఒకడు అల్ జవహరీ. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3 వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరిగా అల్ జవహరీని అమెరికా గుర్తించింది. అప్పటి నుంచి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్‌లో ఒకడిగా ఉన్న అల్ జవహరీ పరారీలోనే ఉన్నాడు. 2011లో అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా హతమార్చిన తర్వాత.. ఆ పదవీ బాధ్యతలను జవహరీ స్వీకరించాడు. జవహరీ తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ప్రకటించింది.