నా వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పేమీ లేదు.. విమర్శలకు ట్రంప్ కౌంటర్
నా వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పు కలుగదు అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2024 3:45 AM GMTనా వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పేమీ లేదు.. విమర్శలకు ట్రంప్ కౌంటర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు తథ్యమంటూ పలువురు అంటున్నారు. మరికొందరు మాత్రంపై ట్రంప్‌పై విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. ప్రాజెక్ట్ 2025 అమలు చేస్తారంటూ ప్రచారం జరుపుతున్నారు.
ఈ మేరకు మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ‘నా వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పు కలుగదు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాడుపడతా. గత వారంలో నాపై తుపాకీ కాల్పులు జరిపారు. ప్రత్యర్థులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి వయసు పైబడింది. ఆయన అధ్యక్షుడు అయితే 2029 వరకు సేవ చేస్తారనే నమ్మకం కూడా లేదు. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థిని మార్చాలని అనకుంటోంది. ఇదే ప్రజాస్వామ్యం. జిన్‌పింగ్ ఒక గొప్ప నేత. 140 కోట్ల మందిని ఉక్కు పిడికిలితో నియంతించారు'. అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ప్రాజెక్టు 2025 గురించి, అమలు చేసే విధానాల గురించి మాత్రం తోసిపుచ్చారు.