అమెరికాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
మెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 16 July 2023 12:44 PM GMTఅమెరికాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అలస్కా ద్వీపకల్పంలో భూకంపం సంభవించింది. దీంతో.. అక్కడ సునామీ వచ్చే అవకాశం ఉందని..ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు అధికారులు వివరించారు. ఉత్తర అమెరికాలోని ఇతర యూఎస్ కెనడియన్ పసిఫిక్ తీరాలకు, సునామీ ప్రమాద స్థాయిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. అయితే.. ఈ భూకంపం ఆదివారం తెల్లవారుజామున 7.4 తీవ్రతతో వచ్చినట్లు తెలిపింది. ఇక సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో అలస్కా, ఇతర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం అయ్యారు. ఇళ్లను ఖాళీ చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఇటీవల మే 25న కాలిఫోర్నియాలో భూంకపం సంభవించింది. అప్పుడు తీవ్రత 5.5గా నమోదు అయ్యింది. అలాస్కా అమెరికాలో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతం. ప్రజలు తక్కువగానే ఉంటారు. ఇక ఇళ్లు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే ప్రాణనష్టం లేదని తెలుస్తోంది. కానీ కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు హడలిపోయారు. ఇళ్ల నుంఇచ బయటకు పరుగులు తీశారు. భవనాల్లో ఉన్నవారైతే హడలిపోయారు. ఇక అలస్కాలో 1964లో 902 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. అప్పుడు ఎగిసిపడ్డ సునామీ ధాటికి 250 మందిపైగా మరణించారు. మరోసారి సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.