ప్రతియేటా 27 లక్షల మంది మృతి.. కారణం అదేనట

Air pollution from fossil fuels causes 30% of deaths in India every year. భారతదేశంలో ప్రతి ఏడాది సంభవించే మరణాల్లో 30 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేననని ఓ నివేదిక తేల్చింది.

By Medi Samrat
Published on : 11 Feb 2021 4:26 PM IST

Air pollution from fossil fuels causes 30% of deaths in India every year

భారతదేశంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. వాయు కాలుష్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా పరిశ్రమల నుంచి వెలువడే వాయువును పీల్చుకుని రోగాల బారిన పడుతున్నారు. ఇక భారతదేశంలో ప్రతి ఏడాది సంభవించే మరణాల్లో 30 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేననని ఓ నివేదిక తేల్చింది. ప్రతియేటా దాదాపు 27 లక్షల మంది విష వాయువులు పీల్చడం వల్ల మరణి్స్తున్నారని హార్వర్డ్‌ విద్యాలయం, కాలేజీ ఆఫ్‌ లండన్‌ విశ్వ విద్యాలయంతో పాటు మరిన్ని ప్రముఖ సంస్థలు జరిపిన అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించి వివరాలు ప్రముఖ ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.

2018లో 80 లక్షల మంది మృతి

బొగ్గు, పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా 2018లో 80 లక్షల మంది మృతి చెందిననట్లు అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి వాలయు కాలుష్యం వల్లేనని వెల్లడించింది. ఈ సంఖ్య అంచనాల కంటే ఎక్కువ ఉందని పేర్కొంది. ఇక దుమ్ము, పొగ, కార్చిచ్చు, పంట వ్యర్థాల దహనం వల్ల గాల్లో కలిసిపోయే సూక్ష్మమైన రేణువుల వల్ల 42 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాల వల్ల సంభవిస్తున్న మరణాల్లో భారత్‌, చైనాలోనే అత్యధికమని అధ్యయనం తెలిపింది. చైనా ఏటా 39.1 లక్షలు, భారత్‌లో 24.6 లక్షల మంది చనిపోతున్నట్లు పేర్కొంది. భారత్‌లో 2018లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ 4,71,546 మంది, బీహార్‌లో 2,88,821 మంది మృతి చెందినట్లు నివేదిక తెలిపింది.




Next Story