ఆప్ఘానిస్తాన్ కల్చర్ హ్యాష్ ట్యాగ్.. ఆన్‌లైన్ ఉద్యమం..!
Afghanistan women launch online campaign to protest talibans burqa.ఆప్ఘాన్ దేశంలోని యూనివర్సిటీల్లో మహిళా విద్యార్థులకు
By అంజి Published on 15 Sep 2021 8:07 AM GMTకాబూల్: ఆప్ఘాన్ దేశంలోని యూనివర్సిటీల్లో మహిళా విద్యార్థులకు డ్రెస్‌కోడ్‌ను తాలిబన్లు తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ఘాన్ యువతులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆప్ఘానిస్తాన్ కల్చర్, డు నాట్ టచ్ మై క్లోత్స్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆప్ఘాన్ కల్చర్ దుస్తులను ధరిస్తూ అక్కడి యువతులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆప్ఘాన్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ బహర్ జలాలీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బహర్ జలాలీ మీడియాతో మాట్లాడారు. ఆప్ఘానిస్తాన్ సంప్రదాయ దుస్తులు రంగురంగులతో కూడిన అందమైన దుస్తులని, వాటిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారన్నారు. డిజైన్లు, డ్రెస్‌లకు అమర్చిన చిన్న చిన్న అద్దాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు.
తాలిబన్ల ఆర్డర్‌కు మద్దతుగా కాబుల్ నగరంలో తాలిబాన్ అనుకూల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు నల్లటి బుర్ఖాలు ధరించారు. చేతులు, మొహం కనిపించకుండా పూర్తిగా వస్త్రధారణ చేశారు. ఈ వస్త్రాధారణ, గత 20 ఏళ్ల నాటికి మహిళల వస్త్రధారణకు పూర్తి విరుద్ధంగా ఉంది. తాలిబన్ల డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అప్ఘాన్ మహిళలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలోలాగానే తాము సంప్రదాయ దుస్తులు వేసుకునేందుకు అనుమతించాలని ఆప్ఘాన్ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందమైన డ్రెస్సులు వేసుకొని దిగిన ఫొటోలను ఆప్ఘాన్ మహిళలు షేర్ చేస్తున్నారు.
This is how Afghan women dress#DoNotTouchMyClothes #AfghanCulture #AfghanWomen pic.twitter.com/0E2iKIW2Ln
— Sophia Moruwat (@SophiaKhanm) September 13, 2021
ఆప్ఘాన్‌లోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ఆకర్షణీయమైన సంప్రదాయ దుస్తులను మహిళలు ధరిస్తున్నారు. అయితే ఇవే తమ గుర్తింపు అని అక్కడి మహిళలు చెబుతున్నారు. గత 20 ఏళ్లలో అక్కడి మహిళలు సంప్రదాయ దుస్తులతో పాటు కాస్త పొట్టిగా ఉండే డ్రెస్‌లను కూడా వేసుకున్నారు. జీన్స్, స్కార్ఫ్‌లను సైతం ధరించేవారు.
This is also Afghan culture. I am wearing a a simple dress. I'm allowing the wind to play with my hair. I'm allowing the sun to kiss my neck. I'm an Afghan woman. I'm a Muslim woman. I'm a citizen of this Earth. I'm a human and I love humanity #AfghanistanCulture #AfganistanWomen pic.twitter.com/trT8ye2sEq
— Nahid Fattahi ناهید فتاحی (@NahidFattahi) September 12, 2021
Black attire, Burqa, and Niqab are not and never been part of the Afghan Culture.
— Zahra Sultani | زارا سلطانی (@zahrasultani_) September 12, 2021
Here's a few different types of traditional Afghan attire for women. It's colourful, modest, practical, and more importantly beautiful.#AfghanistanCulture #AfghanWomen #TalibanTerror https://t.co/OYs89B24LC pic.twitter.com/s8hq0CWaij