షాక్: మరణించిన 12 గంటల తర్వాత లేచిన బాలిక
A three-year-old child who opened her eyes while performing the funeral.. An incident in Mexico. శవపేటిలో ఉంచిన మూడేళ్ల బాలిక చేయి కదిలించడంతో పాటు, కళ్లు తెరిచి చూసింది. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా
By అంజి Published on 26 Aug 2022 1:39 PM ISTతీవ్రమైన రోగాలతో బాధపడేవారిని, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను.. వైద్యులు సాయశక్తులా ప్రయత్నించి కాపాడుతుంటారు. అయితే అప్పుడప్పుడు వైద్యులు కూడా తప్పులు చేస్తుంటారు. రోగులు అపస్మారక స్థితిలోకి వెళ్లినా.. చనిపోయారని ధృవీకరిస్తారు. చివరకు అంత్యక్రియల సమయంలో ఆ రోగులు లేచి కూర్చోవడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మెక్సికో దేశంలో జరిగింది. శవపేటిలో ఉంచిన మూడేళ్ల బాలిక చేయి కదిలించడంతో పాటు, కళ్లు తెరిచి చూసింది. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బతికుండగానే తన బిడ్డ చనిపోయిందని చెప్పారని తల్లి ఆరోపించింది. విల్లా డీ రమోస్ ప్రాంతంలో కమిలా రోక్సానా అనే మహిళ తన 3 ఏళ్ల మార్టినెజ్ మెన్డోతో కలిసి నివసిస్తోంది. ఇటీవల మెన్డోజా అనారోగ్యం బారిన పడింది. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడింది. దీంతో ఆమెను తల్లి స్థానిక చిల్డ్రన్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. మెన్డోజాను పరీక్షించిన డాక్టర్.. ఆమెకు డీహైడ్రేషన్ చికిత్స అందించాలని సూచించాడు.
మరో ఆస్పత్రికి రిఫర్ చేయడంతో.. అక్కడకు వెళ్లిన బాలికకు పారాసిటమల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. కాగా అక్కడ మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు బాలిక పరిస్థితి విషమించింది. బాలికను పరీక్షించి మందులిచ్చిన వైద్యులు.. చిన్నారికి పండ్లు, వాటర్ ఇవ్వాలని సూచించారు. అయినా మెన్డోజా ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఆమెను ఎమర్జెన్సీ రూంకు తరలించి, చికిత్స అందించారు. బాలికకు ఆక్సిజన్ పెట్టారు. చేతి వేలికి ఆక్సీమీటర్ తొడిగి వైద్యం చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు ఇంట్రావీనస్ ద్రవాలను ఎక్కించారు. ఆ తర్వాత బాలిక చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. డీహైడ్రేషన్ కారణంగానే చనిపోయిందని తెలిపారు.
దీంతో మెన్డోజాను ఆమె తల్లి, బంధువులు వారి సొంత ఊరికి తీసుకెళ్లారు. తెల్లారి బాలికకు అంత్యక్రియలు చేసేందుకు రెడీ అయ్యారు. చిన్నారిని ఉంచిన శవ పేటిక కిటికీపై శ్వాసవల్ల పొగమంచు ఏర్పడింది. ఇది గమనించిన తల్లి రోక్సానా.. కుటుంబ సభ్యులతో తెలపగా.. వారు ఆమె మాటలను లెక్క చేయలేదు. ఆ చిన్నారి మరణించిన 12 గంటల తర్వాత అద్భుతం జరిగింది. కొద్దిసేపటికే బాలిక కళ్లు కదిలించింది. ఈ విషయాన్ని మెన్డోజా బామ్మ గుర్తించింది. దీంతో కుటుంబ సభ్యులంతా శవపేటిక తెరిచారు. ప్రాణంతో ఉన్న మెన్డోజాను అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకు మళ్లీ చికిత్స మొదలుపెట్టారు. పాపను బతికించేందుకు తీవ్రంగా శ్రమించగా.. కొద్ది సేపటికే మెన్డోజా మరణించింది.
తన బిడ్డ బతికున్నా చనిపోయినట్టు ప్రకటించిన డాక్టర్లపై తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.