సాధారణంగా మనిషి జీవితం మహా అంటే వందేళ్లు అంటారు. అందుకే ఎవరైనా దీవిస్తే నిండా నూరేళ్లు బతుకు నాయనా అంటారు. అయితే ఇప్పుటి పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగానే ఉన్నాయి. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు పొల్యూషన్, టెన్షన్ వాతావరణం, ఎప్పుడు ఎక్కడ ఏ క్షణం మరణాలు సంబవిస్తాయో తెలియని వైనం. వీటికి తోడు కొత్త కొత్త వైరస్ లు రావడం కూడా ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. అన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే మహా అంటే 60 నుంచి 80 ఏళ్లు అతి కష్టం మీద బతుకుతున్నారు. అతి కూడా చేయని వారు 50 ఏళ్లకే ముసలి జీవితాన్నిఅనుభవిస్తున్నారు.
అలాంటిది ఓ వ్యక్తి వందేళ్లు కాదు.. ఏకంగా 256 ఏళ్లు బతికి సంపూర్ణ జీవితాన్ని అనుభవించారట. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన లీ అనే వ్యక్తి ఏకంగా 256 సంవత్సరాలు జీవించాడట. లీ 677 లో చైనాలో జన్మించి 1933 వరకు జీవించాడట. వందేళ్ల వరకు కూడా ఆయన నిత్య యవ్వనంగా ఉన్నారట.. ఆహార నియమాలు మాత్రమే కాదు.. తన శరీరాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకుంటూ యాక్టీవ్ గా ఉండేవారట.
24 మందిని వివాహం చేసుకున్న ఆయనకు 500 మంది సంతానం ఉన్నారట. ఆయుర్వేద మూలికల సేకరణ, మార్షల్ ఆర్ట్స్ ను నేర్పుతూ జీవనం సాగించారట. అయితే ఆయన అంత కాలం బతకడానికి గల కారణం మంచి శృంగార జీవితం గడపడం, తాబేలులా కూర్చోవడం, పావురంలా నడవడం, కుక్కలా నిద్రించడమే కారణమని చైనా చరిత్రకారులు చెప్తున్నారు.