అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. దాడులు తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన పట్టు నిలుపుకోవడానికి క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలను ఆయుధంగా వాడుకుంటోంది. హోర్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడంతో పాటు, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు జరపడం అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది.
మరోవైపు, అమెరికా తన అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఇరాన్‌లోని 5,500 కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. లెబనాన్‌లో జరుగుతున్న పోరాటం వల్ల ఇప్పటికే 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెరిగిన ఇంధన ధరలను అదుపు చేయడానికి అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుండి 172 మిలియన్ బారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించింది