పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి.. నైజీరియాలో ఘోర విషాదం

నైజీరియాలో ఘోర విషాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మరణించిన ఘటన శనివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on  19 Jan 2025 9:02 AM IST
International News, Petrol tanker explosion, Nigeria

పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి.. నైజీరియాలో ఘోర విషాదం

నైజీరియాలో ఘోర విషాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మరణించిన ఘటన శనివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నైజర్ స్టేట్‌లోని సులేజా ప్రాంతంలో గ్యాసోలిస్ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌లోకి పెట్రోల్ పంపు చేస్తోన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. పెట్రోల్‌ను పంపు చేస్తున్న సిబ్బందితో పాటు చుట్టుపక్కన పదుల మీటర్లలో ఉన్న వారు కూడా మరణించినట్లు నైజీరియా అత్యవసర ప్రతిస్పందన ఏజెన్సీ వెల్లడించింది.

ఈ విషాద సంఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. కాగా వారిని హుటాహుటిన చికిత్స కోసం సమీపాల్లోని హాస్పిటల్స్‌కు తరలించారు. కాగా ఇటీవల కాలంలో నైజీరియా ప్రాంతంలో ఇలాంటి భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో జరిగే ప్రమాదాల్లో నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆఫ్రికా ఖండంలోనే అత్యంత జనాభా కలిగిన నైజీరియాలో సరుకు రవాణాకు సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవడం ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. గతేడాది సెప్టెంబర్‌లో నైజర్ రాష్ట్రంలో పెట్రోల్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొనడం కారణంగా దాదాపు 48 మంది మృతి చెందారు. నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం.. 2020లో 1531 పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి.

Next Story