88వ పెళ్లికి రెడీ అవుతున్న వృద్ధుడు.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాకే.!

61 years old man ready to marriage 88th time. సాధారణంగా పెళ్లి అనేది మనిషి జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక. కొన్ని కారణాలు, పరిస్థితుల కొందరు రెండో పెళ్లి, లేదంటే

By అంజి  Published on  4 Nov 2022 5:09 AM GMT
88వ పెళ్లికి రెడీ అవుతున్న వృద్ధుడు.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాకే.!

సాధారణంగా పెళ్లి అనేది మనిషి జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక. కొన్ని కారణాలు, పరిస్థితుల కొందరు రెండో పెళ్లి, లేదంటే మూడో పెళ్లి చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ తాత మాత్రం అలా కాదు. ఇప్పటి వరకు 87 పెళ్లిళ్లు చేసుకున్న తాత.. ఇప్పుడు 88వ పెళ్లికి రెడీ అవుతున్నాడు. తాత పేరు కాన్‌. ఇండోనేషియాలోని వెస్ట్‌ జావాలోని మజలెంగ్కా ప్రాంతంలో నివసిస్తున్న కాన్‌ తాత వయసు 61 సంవత్సరాలు. 14 ఏళ్ల వయస్సులోనే కాన్‌ తాతా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

అప్పటి నుంచి వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. మహిళలు కూడా ఇష్టంగానే కాన్‌ తాతతో పెళ్లికి రెడీ అవుతున్నారు. తాజాగా కాన్‌ తాత.. 88వ పెళ్లికి రెడీ అయ్యాడు. 14 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నా.. అతడి ప్రవర్తన, పద్ధతి నచ్చకపోవడంతో రెండేళ్లకే భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. మొదటి భార్య.. కాన్‌ కంటే రెండేళ్లు పెద్దది. మొదటి భార్య వదిలి వెళ్లిన తర్వాత.. కాన్‌ తాతా తన శారీరక అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడ్డాడు. అది మొదలు పెళ్లిళ్ల పరంపర మొదలైంది.

పెళ్లి చేసుకోవడం, విడిపోవడం.. ఇలా తన 60 ఏళ్ల వయస్సులో కాన్‌ తాత 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. 88వ పెళ్లి కూతురు మరెవరో కాదు.. అతడి 86వ భార్యే. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమెనే మళ్లీ పెళ్లాడాలని కాన్ తాత నిర్ణయించుకున్నాడు. ఆమె ఇంకా కాన్‌ తాతనే ప్రేమిస్తోందట. ఈ క్రమంలోనే ఆమెనే తిరిగి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కాన్‌ తాత తెలిపాడు. మరి తాత పెళ్లిళ్ల పరంపరకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పడుతుందో? లేదో? వేచి చూడాల్సిందే. కాన్‌ తాతకు 'ప్లేబోయ్ కింగ్' అనే నిక్ నేమ్ కూడా ఉంది. కాన్ తాత.. ఒకసాధారణ రైతు.

Next Story