భారత్​కు అండగా నిలవాల్సిన అవసరం ఇదే

US covid assistance to India. 57 మంది పార్లమెంట్ సభ్యులు భారత్ కు కావాల్సిన సాయాన్ని వెంటనే పంపించాలని బైడెన్ కు రాసిన లేఖలో కోరారు.

By Medi Samrat  Published on  13 May 2021 5:24 AM GMT
biden

వాషింగ్టన్: భారత్ లో కరోనా కేసుల విజృంభణపై ప్రపంచ దేశాలు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్ కు అండగా నిలవాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు లేఖను రాశారు. మొత్తం 57 మంది పార్లమెంట్ సభ్యులు భారత్ కు కావాల్సిన సాయాన్ని వెంటనే పంపించాలని బైడెన్ కు రాసిన లేఖలో కోరారు. ఊహించని విధంగా కరోనా కేసులు భారత్ లో పెరిగిపోతూ ఉన్నాయని.. భారత ఆరోగ్య వ్యవస్థను మరింత దృఢంగా చేయడానికి కావాల్సిన వస్తువులను పంపించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పట్ల తాము ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నామని.. రెండున్నర లక్షలకు పైగా మరణించారన్న వార్త తమను మరింత కలచి వేస్తోందని అన్నారు.

భారత్ లో కరోనా కేసులు తగ్గాల్సిన అవసరం ఉందని.. అక్కడ కరోనా కేసులు పెరుగుతూ ఉండడం అమెరికాకు కూడా ముప్పు లాంటిదేనని పార్లమెంట్ సభ్యులు అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్లు పుట్టుకుని వచ్చే ప్రమాదం ఉందని.. అది మరిన్ని సమస్యలకు తావిస్తుందని కూడా కొందరు హెచ్చరించారు. భారత్ కు కావాల్సిన వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్మెంట్లు, కావాల్సిన వస్తువులను వీలైనంత త్వరగా పంపించాలని జో బైడెన్ కు సూచించారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లు, క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్/అంబులెన్స్ కంటైనర్లు, రెమ్దెసివిర్, వెంటిలేటర్లు వంటివి పంపించాలని కోరారు. భారత్ లోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందాలని అమెరికా పార్లమెంట్ సభ్యులు ఆకాంక్షించారు. భారత్ కు కావాల్సిన రా మెటీరియల్స్ కూడా పంపడం చాలా ముఖ్యమనిన అంశం అని తెలిపారు. ఆస్ట్రాజెనికాకు సంబంధించిన వ్యాక్సిన్ ను కూడా భారత్ కు పంపాలని పార్లమెంట్ సభ్యులు లేఖలో సూచించారు.

అమెరికా నుండి భారత్ కు రా మెటీరియల్స్ వస్తూ ఉన్నాయి.. రాబోయే కాలంలో మరింత సాయం భారత్ అమెరికా నుండి పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ కు సాయం చేయడానికి పలు దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి.


Next Story