టెక్సాస్‌లో భూ ప్ర‌కంప‌న‌లు.. 5.4 తీవ్ర‌త‌

5.4 Earthquake Jolts West Texas Near Midland.అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భూకంపం సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2022 4:43 AM GMT
టెక్సాస్‌లో భూ ప్ర‌కంప‌న‌లు.. 5.4 తీవ్ర‌త‌

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భూకంపం సంభ‌వించింది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం శుక్ర‌వారం సాయంత్రం 5.35 గంట‌ల ప్రాంతంలో టెక్సాస్‌లోని మిడ్‌లాండ్ ప‌ట్ట‌ణంలో భూ ప్రకంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 5.4గా న‌మోదు అయిన‌ట్లు యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే తెలిపింది. భూకంప కేంద్రాన్ని మిడ్‌లాండ్‌కు 22 కిలోమీట‌ర్ల దూరంలో భూమికి 9 కిలోమీట‌ర్ల లోతులో గుర్తించిన‌ట్లు తెలిపారు. ఈ భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఇప్ప‌టి వ‌ర‌కు టెక్సాస్ రాష్ట్రంలో సంభ‌వించిన అతి పెద్ద భూకంపాల్లో ఇది నాలుగోద‌ని అధికారులు తెలిపారు. కాగా.. నెల రోజుల వ్య‌వ‌ధిలో మిడ్‌లాండ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకోవ‌డం ఇది రెండోసారి. న‌వంబ‌ర్‌ 16న కూడా 5.3 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. మిడ్‌ల్యాండ్‌కు పశ్చిమాన 95 మైళ్ల (153 కిలోమీటర్లు) దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Next Story