పాక్‌లో దారుణం.. హిందూ కుటుంబం దారుణ హ‌త్య‌..!

5 Members Of Hindu Family Found Dead in Pakistan's Multan With Throat Slit.పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాజాగా ఓ హిందూ కుటుంబం దారుణ హత్య‌కు గురైన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2021 6:36 AM GMT
5 Members Of Hindu Family Found Dead in Pakistan’s Multan With Throat Slit

పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్క‌డ మైనార్టీలుగా ఉన్న హిందువుల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. దేశంలో నిత్యం ఎక్క‌డో ఒక చోట హిందువుల‌పై దాడులు జ‌రుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ హిందూ కుటుంబం దారుణ హత్య‌కు గురైన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆ కుటుంబంలోని ఐదుగురు స‌భ్యుల గొంతులను ప‌దునైన ఆయుధంతో కోశారు. పాక్‌లోని ర‌హీమ్ యార్ ఖాన్ సిటీకి 15 మీట‌ర్ల‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ర‌హీమ్ యార్ ఖాన్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి కాలనీలో రామ్‌చంద్ అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌డు ట్రైల‌రింగ్ చేసేవాడు. ఆ కుటుంబంలో రామ్‌చంద్‌తో క‌లిపి మొత్తం ఐదుగురు స‌భ్యులు ఉన్నారు. శుక్ర‌వారం ఆ కుటుంబంలోని ఐదుగురు విగ‌త జీవులుగా క‌నిపించారు. రామ్ చంద్ తో పాటు అతని కుటుంబాన్ని కొంతమంది దుండగులు అతిదారుణంగా హత్య చేశారు. పదునైన ఆయుధాలతో వారి గొంతుల‌ను కోసేశారు. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డి ప్రాంతం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని మృత‌దేహాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి హిందూ సంఘాలు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నాయి.


కాగా.. ఈ ఘ‌ట‌న‌పై సోషల్ యాక్టివిస్ట్ బిర్బాల్ దాస్ ఓ మీడియా ఛాన‌ల్‌తో మాట్లాడారు. రామ్ చంద్ మెగ్వాల్ హిందూ కమ్యూనిటీకి చెందిన వారన్నారు. అతను చాలాకాలంగా ట్రైలర్ షాప్ నడుపుకుంటూ ప్ర‌శాంతంగా జీవితం గడుపుతున్నారని వివరించారు. ఈ ఘటన చాలా దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు.
Next Story