నిరసనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి
5 Killed In Shooting At Protesters In Busy Iran Market.ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నిరసనకారులపై కాల్పుల
By తోట వంశీ కుమార్
ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నిరసనకారులు, భద్రతాబలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఇరాన్ దేశంలోని నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఓ వైపు ఇరాన్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన సాయుధ దుండగులు భద్రతాబలగాలు, నిరసన కారులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఐదుగురు మరణించగా, 10మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ, ఓ బాలికతో పాటు ముగ్గురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఖుజెస్తాన్ డిప్యూటీ గవర్నర్ వాలియోల్లా హయాతి చెప్పారు. కాగా.. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించలేదు.
కాగా.. ఇరాన్‌లో ఇలాంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి. అక్టోబర్ 26న షిరాజ్‌లోని షా చెరాగ్ సమాధిపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చేసిన సాయుధ దాడిలో 13 మంది మరణించారు. 22 ఏళ్ల మహ్సా అమి హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ అక్కడి పోలీసులు ఆమెను చేశారు. మూడు రోజుల తరువాత ఆమె మరణించింది. దీంతో సెప్టెంబర్ 16 నుంచి ఇరాన్ దేశ వ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నిరసనల్లో 300 మందికి పైగా మరణించారు.