బ్యాంకులో కాల్పులు కలకలం.. ఐదుగురు బ్యాంకు ఉద్యోగులు మృతి
యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలో ఓ బ్యాంక్ కార్యాలయంలో
By అంజి Published on 11 April 2023 4:15 AM GMTబ్యాంకులో కాల్పులు కలకలం.. ఐదుగురు బ్యాంకు ఉద్యోగులు మృతి
యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలో ఓ బ్యాంక్ కార్యాలయంలో తోటి ఉద్యోగి తన సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కాల్పుల ఘటనలో కనీసం ఐదుగురు బ్యాంకు ఉద్యోగులు మరణించారు, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో కెంటకీ గవర్నర్‌కు సన్నిహితుడైన టామీ ఇలియట్ కూడా ఉన్నారు. కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్.. మైనర్ లీగ్ బాల్‌పార్క్ లూయిస్‌విల్లే స్లగ్గర్ ఫీల్డ్, వాటర్‌ఫ్రంట్ పార్క్‌కు దూరంగా ఉన్న భవనంలో జరిగిన కాల్పుల్లో తన సన్నిహిత స్నేహితుల్లో ఒకరిని కోల్పోయినట్లు ధృవీకరించారు.
మిగిలిన వారిని జాషువా బారిక్ (40), టామీ ఇలియట్ (63), జూలియానా ఫార్మర్ (45), జేమ్స్ టట్ (64), డీనా ఎకెర్ట్ (57)గా గుర్తించారు. దాడిని ప్రత్యక్ష ప్రసారం చేసి అక్కడికక్కడే మరణించిన షూటర్‌ను 23 ఏళ్ల కానర్ స్టర్జన్‌గా గుర్తించినట్లు అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు. అయితే, ఈ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ త్వరగా తొలగించాయి. లూయిస్‌విల్లే మెట్రో పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. షూటర్ పోలీసుల కాల్పుల వల్ల చనిపోయాడా లేదా స్వీయ గాయంతో మరణించాడా అనేది వారికి ఖచ్చితంగా తెలియలేదు. స్టర్జన్ రైఫిల్‌తో కాల్చుకున్నాడని పోలీసు చీఫ్ జాక్వెలిన్ గ్విన్-విల్లారోల్ విలేకరులతో అన్నారు.
దాదాపు ఉదయం 8.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఘటన గురించి తమకు సమాచారం అందిందని, నిమిషాల వ్యవధిలోనే కాల్‌కు స్పందించామని పోలీసులు రాయిటర్స్‌కు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి గత ఏడాది ఓల్డ్ నేషనల్ బ్యాంక్ డౌన్‌టౌన్ బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ ఉద్యోగిగా చేరినట్లు పోలీసులు తెలిపారు. షూటర్ తల్లి ఫేస్‌బుక్ పేజీ ప్రకారం.. స్టర్జన్ దక్షిణ ఇండియానాలో పెరిగాడు. ఇది లూయిస్‌విల్లేకు ఉత్తరంగా ఉంది. ఇద్దరు అబ్బాయిలలో పెద్దవాడు. అతను ఇండియానాలోని ఫ్లాయిడ్స్ నాబ్స్‌లోని ఫ్లాయిడ్ సెంట్రల్ హైస్కూల్‌లో చదివాడు. అతని తండ్రి టాడ్ కోచ్‌గా ఉన్న జట్టు కోసం బాస్కెట్‌బాల్ ఆడాడు.