షాకింగ్‌ న్యూస్‌ : ప్రపంచ వ్యాప్తంగా 4 వేల కొత్త కరోనా రకాలు

4,000 variants of coronavirus that causes Covid-19. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 వేల కరోనా కొత్త రకాలు ఉన్నాయని బ్రిటన్‌ మంత్రి నదీమ్‌ జహావీ వెల్లడించారు.

By Medi Samrat  Published on  5 Feb 2021 12:18 PM GMT
4,000 variants of coronavirus that causes Covid-19.

ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే..మరో వైపు యూకే కొత్త కరోనా వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 వేల కరోనా కొత్త రకాలు ఉన్నాయని బ్రిటన్‌ మంత్రి నదీమ్‌ జహావీ వెల్లడించారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా సహా అన్ని టీకాల తయారీ సంస్థలు తమ టీకాలను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతూ అనేక రకాల వైరస్‌లు వెలుగులోకి వచ్చాయన్నారు.

బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 వేల కరోనా రకాలు ఉన్నాయని, తాము కొత్త రకాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌ తెలిపింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతూ కొత్త రకాల వైరస్‌లు ఏర్పడుతుండటంతో అన్ని రకాల వైరస్‌లపై అధ్యయనం చేస్తూ స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌ మంత్రి తెలిపారు. 2019 చివరిలో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ కొద్ది నెలల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికిపైగా కరోనా బారిన పడగా, 22 లక్షలకుపైగా మృత్యువాత పడ్డారు. అయితే టీకాలు వచ్చాయని ఆనందపడేలోపు ఈ కొత్త రకం వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. కాగా, బ్రిటన్‌లో విజృంభిస్తున్నకొత్తరకం వైరస్‌ 80కిపైగా దేశాలకు పాకింది.

ఈ కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌ బయట పడటంతో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. కోవిడ్‌-19 కంటే ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు తెలిపారు. కొత్త రకం వైరస్‌ బయటపడటంతో ప్రభుత్వాలు సైతం అప్రమత్తం అయ్యాయి. పలు దేశాలు యూకే విమానాలపై నిషేధం విధించాయి.



Next Story