రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. 3గురు మృతి.. 33 మందికి తీవ్ర గాయాలు

3 Killed 33 Injured In Gas Explosion In China.ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. మూడు అంత‌స్తులు గ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2021 12:39 PM IST
రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. 3గురు మృతి.. 33 మందికి తీవ్ర గాయాలు

ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. మూడు అంత‌స్తులు గ‌ల రెస్టారెంట్ భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా.. మ‌రో 33 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్ ప్రాంతంలో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది.

స్థానిక మీడియా వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. షెన్‌యాంగ్ ప్రాంతంలో గురువారం ఉద‌యం 8.20 గంట‌ల స‌మ‌యంలో ఓ రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు సంభ‌వించింది. ఓ కారు డాష్ బోర్డులో కెమెరాలో ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యింది. భారీగా మంట‌లు చెల‌రేగ‌డంతో పాటు పెద్ద ఎత్తున దుమ్ము దూళీ ఎగిసిప‌డ్డాయి. ఎం జ‌రిగిందో తెలియ‌క ప్ర‌జ‌లు ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీయ‌డం ఆ వీడియోలో క‌నిపించింది. సమీపంలో పార్క్ చేసిన ఉన్న వాహ‌నాల‌పై రెస్టారెంట్‌ శిధిలాలు ప‌డ‌డంతో ప‌లు వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

30 ఫైరింజ‌న్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 3 ముగ్గురు మృతి చెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ‌రో 33 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌గా.. వారిని చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నార‌నే దానిపైన ఇంకా స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేదు. స‌హాయ‌క చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గ్యాస్ పేలుడు కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగిందా..? మ‌రేదైనా కార‌ణంగా పేలుడు సంభ‌వించిందా అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story