బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. శిబిచార్ పట్టణ సమీపంలో పద్మ నదిలో దాదాపు 30 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవను రవాణా ఓడ ఢీకొంది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురిని కాపాడినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, విపత్తు నివారణ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి పలువురిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా కొందరు గల్లంతయినట్టుగా తెలుస్తోంది. పడవ సామర్ధ్యం కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడం కూడా జరిగి ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు.

పడవలో ఎంత మంది ప్రయాణిస్తున్నారు అన్నది కచ్చితంగా తెలియదు కాబట్టి ఎంత మంది గల్లంతయ్యారు అన్న విషయం పై స్పష్టమైన సమాచారం లేదు. దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని.. ప్రమాదంలో బయటపడిన వారిచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నామని అధికారులు ప్రకటించారు.సామ్రాట్

Next Story