ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మరో 33 మంది గాయపడ్డారు. కైరో రాజధానిని కలిపే జాతీయ రహదారిపై మిన్యా ప్రావిన్స్‌లో మంగళవారం తెల్లవారుజామునఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. మలావి నగరంలో బస్సును ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కన ట్రక్కుకు సంబంధించిన టైర్లు మారుస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈజిప్ట్‌లో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది చనిపోతున్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ రూల్స్‌ను సరిగా అమలు చేయపోకవడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా. మరో 18 మంది గాయపడ్డారు.