సౌదీ అరేబియాలోని యాసిర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హజ్ యాత్రికులతో వెలుతున్న బస్సు అదుపు తప్పి వంతెనను ఢీ కొట్టడంతో బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. యెమెన్ సరిహద్దులోని నైరుతి యాసిర్ ప్రావిన్స్ మరియు అభా నగరాన్ని కలిపే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా బావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతులను గుర్తించాల్సి ఉంది.