చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది

By అంజి  Published on  23 July 2023 1:11 AM GMT
bus plunges into pond, Bangladesh, road accident

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు సహా 17 మంది మృతి చెందారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భండారియా ఉపజిల్లా నుండి పిరోజ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఉదయం 9.55 గంటలకు ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా డ్రైవర్ చక్రాల నియంత్రణ కోల్పోవడంతో చెరువులో పడిపోయిందని ఝలకతి సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి నసీర్ ఉద్దీన్ తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 35 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని జలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

స్థానిక అగ్నిమాపక సిబ్బంది బస్సును జలదిగ్బంధం నుంచి బయటకు వెలికి తీశారు. ప్రమాదానికి గురైన బషర్ స్మృతి పరిబహన్ బస్సులో 60-70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ జహీరుల్ ఇస్లాం ప్రకారం, రెస్క్యూ కార్మికులు సంఘటనా స్థలం నుండి 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారు. గాయపడిన వారిలో ఐదుగురిని బరిషల్‌లోని షేర్-ఎ-బంగ్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మిగిలిన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో చేర్చారు. ఈ సంఘటన తర్వాత ఖుల్నా-జలకతి రహదారిపై ట్రాఫిక్ మూసివేయబడింది, ప్రతి వైపు వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

Next Story