శృతిమించిన తాలిబ‌న్ల ఆగ‌డాలు.. కాబుల్ ఎయిర్ పోర్ట్‏లో భారతీయుల కిడ్నాప్..?

150 people mostly Indian nationals kidnapped by Taliban.అఫ్ఘానిస్థాన్‌ను హ‌స్త గ‌తం చేసుకున్న త‌రువాత తాలిబ‌న్లు మ‌రింత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2021 7:43 AM GMT
శృతిమించిన తాలిబ‌న్ల ఆగ‌డాలు.. కాబుల్ ఎయిర్ పోర్ట్‏లో భారతీయుల కిడ్నాప్..?

అఫ్ఘానిస్థాన్‌ను హ‌స్త గ‌తం చేసుకున్న త‌రువాత తాలిబ‌న్లు మ‌రింత రెచ్చిపోతున్నారు. అంద‌రిని క్ష‌మించాం. ఎవ్వ‌రిపై ప్ర‌తీకార దాడుల‌కు దిగం అని పైకి శాంతి మంత్రం జ‌పిస్తూనే మ‌రోవైపు త‌మ‌పై నిర‌స‌న‌లు తెలిపే పౌరుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నారు. ప్ర‌తి ఇంటిలో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఆఫ్గనిస్థాన్‌లోని భారత ఎంబెసీల్లో సోదాలు జరిపిన తాలిబన్లు ప‌లు కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే.

తాలిబ‌న్ల ఆరాచ‌కాలు గురించి తెలిసి ఆ దేశంలో ఉన్న విదేశీయులు స్వ‌దేశాల‌కు త‌ర‌లివెలుతుండ‌గా.. ఆ దేశ పౌరులు చాలా మంది విదేశాల‌కు వెళ్లేందుకు య‌త్నిస్తున్నారు. ఎయిర్ పోర్టులోకి అనుమ‌తించ‌క పోవ‌డంతో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు కాబుల్ విమాన ప‌రిస‌ర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తాలిబ‌న్ల ఆగ‌డాలు మ‌రింత శృతి మించాయి. కాబూల్ విమానాశ్రయం స‌మీపం నుంచి సుమారు 150మంది పౌరుల‌ను తాలిబ‌న్లు అప‌రిహ‌రించిన‌ట్లు సమాచారం. అఫ్గాన్ నుంచి ఇత‌ర దేశాల‌కు త‌ర‌లింపున‌కు సిద్దంగా ఉన్న‌వార‌ని నిర్బందించిన‌ట్లు తెలుస్తోంది.

ఇక తాలిబ‌న్లు నిర్భందించిన వారిలో అధిక సంఖ్య‌లో భార‌తీయులు ఉన్న‌ట్లు అక్క‌డి మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల నేప‌థ్యంలో భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యింది. భార‌త వైమానిక విమానం సీ-130 కాబుల్ నుంచి కొద్ది గంట‌ల క్రితం 85 మంది భార‌తీయుల్ని త‌ర‌లించింది. ఈ విమానం త‌జ‌కిస్థాన్‌లోని దుష‌న్‌బే లో సుర‌క్షితంగా ల్యాండ్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో అప‌హ‌ర‌ణ గురించిన వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. కాగా.. ఈ వార్త‌ల‌ను తాలిబ‌న్ ప్ర‌తినిధి ఖండించారు.

Next Story