వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు.. 14 మంది మృతి

14 Killed in mass shooting at US Walmart Store.అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం రేగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2022 12:00 PM IST
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు.. 14 మంది మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం రేగింది. వ‌ర్జీనియా రాష్ట్రంలోని చీసాపీక్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఓ దుండ‌గుడు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది మ‌ర‌ణిచారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. పోలీసుల కాల్పుల్లో దుండ‌గుడు కూడా హ‌త‌మ‌య్యాడు అని స్థానిక మీడియా తెలిపింది. అయితే.. పోలీసులు మాత్రం తాము కాల్పులు జ‌ర‌ప‌లేద‌ని అంటున్నారు.

వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పుల జ‌రుగుతున్నాయ‌నే స‌మాచారం అంద‌గానే పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. ఆ స్టోర్‌ను చుట్టుముట్టారు. స్టోర్‌కి ప్ర‌వేశించి దుండ‌గుడిపై కాల్పులు జ‌రిపారు. అనంత‌రం గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

సామ్ సర్కిల్‌లోని వాల్‌మార్ట్‌లో మరణాలు సంభవించిన యాక్టివ్ షూటర్ సంఘటనను చీసాపీక్ పోలీసులు ధృవీకరించారు. "షూటర్ మరణించాడు," అని చీసాపీక్ సిటీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.


ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్జీనియా రాష్ట్ర సెనేటర్ లూయిస్ లూకాస్ మాట్లాడుతూ.. "వర్జీనియాలోని చీసాపీక్‌లోని నా జిల్లాలోని వాల్‌మార్ట్‌లో ప్ర‌జ‌ల‌పై కాల్పులు జ‌ర‌గ‌డం చాలా బాధాక‌రం. మన దేశంలో చాలా మంది ప్రాణాలను తీసిన ఈ తుపాకీ హింస మహమ్మారిని అంతం చేయడానికి పరిష్కారాలను కనుగొనే వరకు నేను విశ్రమించను" అని ట్వీట్ చేశారు.

Next Story