కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌.. 14 మంది దుర్మ‌ర‌ణం

14 Dead in Military Helicopter Crash in Mexico.మెక్సికో దేశంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. సైనిక హెలికాప్ట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 5:33 AM GMT
కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌.. 14 మంది దుర్మ‌ర‌ణం

మెక్సికో దేశంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. సైనిక హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో 14 మంది దుర్మ‌ర‌ణం చెందారు. వాయువ్య మెక్సికోలోని సినలోవా రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అధికారులు చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో హెలికాఫ్ట‌ర్‌లో 15 మంది ఉండ‌గా.. అందులో 14 మంది మ‌ర‌ణించ‌గా ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌న్నారు. క్ష‌త‌గాత్రుడికి చికిత్స అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బ్లాక్ హాక్ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియ‌రాలేద‌ని నేవి ఓ ప్ర‌క‌న‌లో తెలిపింది.

ఇదిలా ఉంటే.. మెక్సికలో డ్రగ్‌ కింగ్‌గా పేరొందిన డ్రగ్‌ ట్రాఫికర్‌ రాఫెల్‌ కారో క్వింటెరోను నేవీ అరెస్టు చేసిన తర్వాత ఈ ఘ‌టన చోటుచేసుకోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ ప్ర‌మాదానికి అత‌డికి ఏమ‌న్నా సంబంధం ఉందా అనే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త లేద‌ని, ఈ కోణంలోనూ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. 1985లో అమెరికాకు చెందిన యాంటీ నార్కోటిక్స్‌ ఏజెంట్‌ హత్య కేసులో డ్రగ్ కింగ్‌ రాఫెల్‌ను నౌకాదళం అదుపులోకి తీసుకుంది.

Next Story