ఆ దేశంలో 10 మంది పిల్లలను కని పెంచితే.. రూ.13 లక్షల రివార్డ్
13 lakh reward for a woman who gives birth to 10 children in Russia. రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సోవియట్ కాలం నాటి ''మదర్ హీరోయిన్''
By అంజి Published on 18 Aug 2022 9:00 PM ISTరష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సోవియట్ కాలం నాటి ''మదర్ హీరోయిన్'' అవార్డును తిరిగి ప్రారంభించారు. రష్యాలో జననాల రేటు పడిపోయింది. జనాభా సంక్షోభంతో రష్యా దేశం పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే కనీసం 10 మంది పిల్లలను కని, పెంచితే, ఆ మహిళకు దాదాపు రూ. 13 లక్షల రూపాయలను రివార్డుగా ఇస్తానని రష్యా అధ్యక్షుడు ప్రకటించారు. కోవిడ్, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో జనాభా తగ్గుదలకు సంబంధించిన సంక్షోభం నెలకొన్నది.
కరోనా మరణాలు, దానికి తోడుగా ఉక్రెయిన్ చేసిన యుద్ధం వల్ల వేలాది మంది సైనికుల ప్రాణాలు పోయాయి. ఇది రష్యా జనాభాపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా.. ఇప్పటి వరకు దాదాపు 50 వేల మంది సైనికులు ప్రాణాలను రష్యా కోల్పోయింది. మరోవైపు ఉక్రెయిన్‌కు యూరోపియన్ దేశాల మద్దతు కారణంగా ఇంకా యుద్ధం కొనసాగుతోంది. దీంతో రష్యా ఆర్మీలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్త పథకాన్ని ప్రారంభించారు.
ఏ మహిళైనా కనీసం 10 మంది పిల్లలకు జన్మనిస్తే.. ఆ మహిళకు 10 లక్షల రూబుల్స్(రష్యా కరెన్సీ)ని గిఫ్ట్‌గా ఇస్తామని పుతిన్ ప్రకటించారు. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 13 లక్షలు. అయితే ఇందులో కొన్ని కండీషన్స్ ఉన్నాయి. పదో శిశువు జన్మించిన సంవత్సరం తరువాత ఈ రివార్డును ఇస్తారు. మరో కండిషన్ ఏంటంటే.. ఆ 10 మంది పిల్లలు జీవించి ఉండాలి. 10వ శిశువు ఫస్ట్ బర్త్‌డే తరువాత ఈ రివార్డును అందుకోవడానికి ఆ మహిళ అర్హత సాధిస్తుంది. కాగా రష్యా జనాభా క్షీణత రేటు 2021 నుండి దాదాపు రెట్టింపు అయ్యింది
రెండవ ప్రపంచ యుద్ధంలో భారీ జనాభా నష్టాల నేపథ్యంలో సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ 1944లో తొలిసారిగా స్థాపించిన 'మదర్ హీరోయిన్' అనే ఈ పథకాన్ని పుతిన్ సోమవారం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ పథకాన్ని ఆపేశారు. సోవియట్ కాలం నాటి టైటిల్ మాదిరిగానే, రష్యా మదర్ హీరోయిన్ అవార్డు 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కని, పెంచే మహిళలకు ఇవ్వబడుతుంది.